రైలు ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020లో ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించింది. దీంతో టికెట్ ధరలు 50శాతం వరకూ తగ్గాయి. గతంలో మెము/డెము ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ స్పెషల్స్ మార్చడంతో కనీస టికెట్ ధర రూ.10-రూ.30 ఉండేది. ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం తాజాగా ధరలను పునరుద్ధరించింది.
ఇక సవరించిన చార్జీలు ఇవాల తెల్లవారు జాము నుంచి అమల్లోకి వచ్చాయి. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా ‘ప్యాసింజర్ రైళ్ల’ను క్రమంగా నిలిపివేసింది.