ఉద్యోగులకి శుభవార్త:ప్రొవిజనల్ పెన్షన్ కి కేంద్రం సిద్ధం..!

-

కేంద్రం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలానే ఉద్యోగులకి కొంత ఉపశమనం కల్పించాలని కేంద్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కరోనా వైరస్ కష్ట కాలం లో పెన్షన్ సులభంగానే అందించడానికి కేంద్రం సవరించింది ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే వీళ్ళకి ప్రొఫెషనల్ పెన్షన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.

money
money

అయితే రెగ్యులర్ పెన్షన్ పేమెంట్ జారీ చేసే అంత వరకు కూడా ఈ పెన్షన్ అందిస్తామని చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే కరోనా కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు హెడ్ ఆఫీస్ లో పెన్షన్ ఫామ్స్ ను సమర్పించడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జితేంద్ర సింగ్ తెలిపారు.

అయితే సర్వీస్ బుక్ తో కలిపి క్లీన్ ఫామ్స్ ని, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ లో సరైన టైమ్ కు అందించలేకపోతున్నారు అని ప్రొఫెషనల్ పెన్షన్ ఫెసిలిటీ అందిస్తున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ డిపార్ట్మెంట్ లో అప్ గ్రేడ్ అవుతోంది అని జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే ఉద్యోగులు పదవీ విరమణ చేసే రోజునే వారికి పీపీవో అందిస్తున్నట్లు కూడా చెప్పారు. అంతే కాకుండా డిజిటలైజేషన్ లో భాగంగా ప్రత్యేక పోర్టల్ ఆవిష్కరించారు అని ఆయన చెప్పారు పదవీ విరమణ కి దగ్గర లో ఉన్న వారు పెన్షన్ స్టేటస్ ని వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news