పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 550 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ… పోలవరం నిర్వాసితులకు మొదట్లో అనుకున్న దానికంటే అదనంగా రూ. పది లక్షలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుంది అని ప్రకటించారు. కర్నూలులో లోకయుక్త మరియు ఎన్ హెచ్ ఆర్ సి ఆఫీసులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2020-21 సంవత్సరానికి నేతన్న నేస్తం పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. ఆగస్ట్ 24 న 10వేల నుండి 20 వేలు ఉన్న అగ్రి గోల్డ్ బాధితులకు పరిహారం చెల్లిస్తామన్నారు. సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ PP1 పేరుతో అంగన్వాడీ స్కూల్ లలో విద్య నేర్పాలని.. ఫౌండేషన్ స్కూల్స్ లో PP1,PP2,1,2 తరగతులకు పాఠాలు ఉంటాయన్నారు. హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూల్ లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.