రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్

-

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలన్నింటికీ రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.వెంటనే అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇప్పటికే గత ఫిబ్రవరి 29తో ఈ-కేవైసీ గడువు ముగిసింది. అయితే, అనేకమంది లబ్ధిదారుల నుంచి విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేశారని పేర్కొంది.

మరోసారి గడువు తేదీ పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని.. అందుకే తప్పనిసరి అందరూ వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ-కేవైసీ ద్వారా రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి కుటుంబంలో సభ్యుడా? కాదా? అనేది తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మాత్రమే అర్హులకు రేషన్ అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news