శుక్రవారం నాడు ప్రభుత్వం ”మేర రేషన్” ఆప్ ని విడుదల చేసింది. దీని వల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్ ముఖ్యంగా వలస వెళ్లే వాళ్లకి ఇది ఉపయోగ పడుతుంది. దీంతో దగ్గరలో ఉన్న ఫెయిర్ ప్రైస్ షాప్ కి వెళ్లి ట్రాన్సాక్షన్స్ ని చెక్ చేసుకోవచ్చు . రేషన్ దుకాణం, లావాదేవీలు, సరుకులు వంటి వివరాలని కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వాళ్లు తయారు చేశారు. ఇప్పటికి హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంది. క్రమంగా 14 భాషల్లోకి దీనిని తీసుకు వస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) లబ్ధిదారుల లో, ముఖ్యంగా వలస లబ్ధిదారులు, ఎఫ్‌పిఎస్ డీలర్లు మరియు ఇతర సంబంధిత వాటాదారుల లో ONORC సంబంధిత సేవలను ఈజీ చేయడానికి ఎన్‌ఐసి సహకారంతో ఈ యాప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ వ్యవస్థను అమలు చేయడం వల్ల దేశ వ్యాప్తంగా ఏదైనా సరసమైన ధరల దుకాణం (ఎఫ్‌పిఎస్) వద్ద జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) మరియు ఇతర సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు రేషన్ లభ్యత లభిస్తుంది.