దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాల మంది ఇంటి నుండి బయటికి రావడానికే భయపడిపోతున్నారు. అయితే మీకు మీరు స్టేట్ బ్యాంక్ కస్టమరా? మీకు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIలో అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే.
తాజాగా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక కరోనా వైరస్ కారణంగా నెలకొన్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. అంతేకాక ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు చెక్ బుక్‌ను ఏ అడ్రస్‌కైనా డెలివరీ పొందొచ్చునని బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే మీకు కూడా ఎస్‌బీఐ చెక్ బుక్ కావాలని అనుకుంటే ఇంటికే డెలివరీ పొందొచ్చునన్నారు. దీని కోసం మీరు బ్యాంక్‌కు కూడా వెళ్లాల్సిన పని లేదన్నారు. ఇక ఆన్‌లైన్‌లోనే సులభంగానే చెక్ బుక్ పొందొచ్చునని తెలిపారు. దీని కోసం మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండాలని పేర్కొన్నారు. ఇక ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చునని అన్నారు.
ఇక ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రిజిస్టర్డ్ అడ్రస్‌లో లేనటువంటి వారికి ఊరట కలుగనుందని తెలిపారు. కరోన వైరస్ కారణంగా ఎక్కడైనా చిక్కుకుపోయిన వారు కూడా అక్కడికే చెక్ బుక్‌ను డెలివరీ తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక చెక్ బుక్ పొందాలని అనుకునే వారు.. ముందుగా నెట్ బ్యాంకింగ్‌తో లాగిన్ అవ్వాలని పేర్కొన్నారు. తర్వాత రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపారు. తర్వాత చెక్ బుక్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకోవాలి. మీకు ఎన్ని చెక్‌లు కావాలో కూడా తెలియజేయాలని అన్నారు. తర్వాత సబ్‌మిట్ చేయాలి. అటుపైన అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు మీ చెక్‌బుక్ మీరు పెట్టిన అడ్రస్‌కు వచ్చేస్తుందని తెలిపారు.