టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీల డేట్ ఫిక్స్..?

-

తెలంగాణ ఉపాధ్యాయ బదిలీల, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. ఈ పదోన్నతుల ద్వారా దాదాపుగా 5,563 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయన్నారు.

ఇక 11,062 ఉపాధ్యాయ పోస్టులు.. డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. ఇక గతంలో అన్నింటినీ కలిపి హేతుబద్దీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేకుండా చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు నియంత్రణకు మూడు, నాలుగు నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news