వంద మంది మోడీలు వచ్చినా బీఆర్ఎస్ ని ఏమి చేయలేరు : ఎర్రోళ్ల శ్రీనివాస్

-

సీఎం రేవంత్ రెడ్డి అడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్పి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. వాస్తవంగా బీజేపీకి ఓటు బదిలీ చేసింది కాంగ్రెస్ నేతలే అని అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను దింపిందని విమర్శించారు. సిద్దిపేటలో హరీష్ రావు బీజేపీకి ఓట్లు బదిలీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం కరెక్ట్ కాదని అన్నారు.

రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకే ఆధిక్యత వచ్చిందని గుర్తుచేశారు. అంటే అక్కడ బీజేపీకి రేవంత్ రెడ్డే ఓట్లు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. కొండంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న రేవంత్ ఈ ఎన్నికల్లో 22 వేలకు పడిపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ వస్తే మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే వారని అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లు బదిలీ చేసి అక్కడ డీకే అరుణను గెలిపించారని ఆరోపించారు స్వయంగా రాష్ట్ర మంత్రులే బీజేపీకి అవయవదానం చేశారని అన్నారు. వెయ్యిమంది రేవంత్లు వంద మంది మోడీలు వచ్చినా బీఆర్ఎస్ ను ఏమీ చేయలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news