కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. రైతులకి కూడా ఎన్నో పధకాలు వున్నాయి. అయితే ఈ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడ ఒకటి. ఈ స్కీమ్ చాల పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రైతులకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యం తో కేంద్రం ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగింది.
ఈ పీఎం కిసాన్ స్కీమ్ లో చేరిన వారికి ప్రతి ఏటా రూ.6 వేలు వస్తాయి. ఇవి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల లోకి చేరుతాయి. అయితే ఇప్పటి దాక చూస్తే… 7 విడతల డబ్బు రైతులకు అందింది. ఇక 8వ విడత డబ్బులు కూడా ఈ వారం లో వచ్చే ఛాన్స్ వుంది.
ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్న వారికి ప్రతి సంవత్సరం రూ.36 వేలు పొందే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి పూర్తిగా చూస్తే… ఈ బెనిఫిట్ పొందాలంటే రైతులు కిసాన్ మాన్ ధన్ యోజన పథకం లో చేరాలి. మాన్ ధన్ స్కీమ్‌లో రైతులు ఈజీగా చేరొచ్చు.
దీనితో ప్రతీ సంవత్సరం రూ.36 వేలు వస్తాయి. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు ఇస్తారు. అంటే ఏడాదికి రూ.36 వేలు వస్తాయి. ఈ పధకం లో జాయిన్ అవ్వాలంటే రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాలి. 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ.55 కట్టాలి. అదే 40 ఏళ్లు ఉంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.