టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగ సభలో పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభ లో .. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
ఇక ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభ.. సాయంత్రం 6.30 గంటలకు శేరిలింగంపల్లి జనసభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు.