దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వచ్చే పది రోజులు కచ్చితంగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తే కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా కేసులు చాలా తగ్గాయని కాని ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నమోదు అయ్యే కేసులు అన్ని కూడా వారివే.
కొత్తగా కరోనా లక్షణాలతో ఎవరూ ఆస్పత్రుల్లో చేరడం లేదు. మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ కేసులు అన్నీ కూడా ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే. రాష్ట్రాల్లో ఆశా వర్కర్లు ఇంటి ఇంటికి వెళ్తున్నారు. ఎవరికి కూడా కరోనా వైరస్ లక్షణాలు కనపడటం లేదు. ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు అన్నీ కూడా తభ్లిఘీ జమాత్ సభ్యులవే కావడం విశేషం.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గితే కరోనా కట్టడి అయినట్టే అనే అభిప్రాయం వినపడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు ఇతరులవి కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరికి కూడా బయటి వారికీ కరోనా రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎవరికి కరోనా లక్షణాలు బయటపడటం లేదు. ఇది నిజంగా దేశానికి గుడ్ న్యూస్ అంటున్నారు.