కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ లో రెండో రోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పారు. 4 కోట్ల 80 లక్షల వడ్డీ లేని రుణాలు హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాలకు అందిస్తున్నామని.. 1 కోటి 90 లక్షలు పట్టణ ప్రాంతాల రేపటి వరకు వారికి ఇస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ రుణాలు ఇస్తున్నారని.. మొత్తంగా 20 కోట్లు హుజురాబాద్ మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. అందరూ ఎమ్మెల్యేలు మహిళ భవనాలు కట్టిస్తే హుజురాబాద్ లో ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. 3 కోట్ల 10 లక్షలతో 16 గ్రామాలకు మహిళ సమైక్య భవనాల కోసం మంజూరు చేస్తున్నానని… 3 నెలల్లో అన్ని గ్రామాల్లో మహిళల భవనాలు పూర్తి కావాలని తెలిపారు. అభయ హస్తం పింఛన్ డబ్బులు వాపస్ ఇవ్వాలని చెప్పామని.. మిత్తితో సహా చెల్లించడంతో పాటు ఆసరా పింఛన్ ఇస్తామన్నారు.
దేశంలో రైతుకు పెట్టుబడి ఇస్తున్నది ఒక కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.