నిరుద్యోగులకు శుభవార్త.. NTPCలో ఖాళీలు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో ఈ నియామకాలు చేపట్టిన్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గేట్(GATE) స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లకు జూన్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. కనుక త్వరగా అప్లై చేసుకోండి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఎల‌క్టికల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, పవ‌ర్ సిస్ట‌మ్స్ & హై ఓల్టేజ్‌, మెకానిక‌ల్, ప్రొడ‌క్ష‌న్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌, ప్రొడ‌క్ష‌న్ & ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌, థ‌ర్మ‌ల్‌, మెకానిక‌ల్ & ఆటోమేష‌న్‌ కోర్సుల్లో బీటెక్ చేసిన వారు ఈ జాబ్ కి అర్హులు.

గరిష్ట వయస్సు 27 ఏళ్లు ఉండాలి. వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. అలానే అప్లై చేసుకునే వారు తప్పనిసరిగా గేట్ 2021 పరీక్షకు ఎటెండ్ అయ్యి ఉండాలి. పూర్తి వివరాలని https://www.ntpccareers.net/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news