ఫెస్‌బుక్ లైవ్‌లో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు

బెంగాలీ టీవీ నటుడు సువో చక్రవర్తి ఆత్మహత్యాయత్నం చేశారు. ఫేస్‌బుక్ లైవ్‌లో నిద్ర మాత్రలు తీసుకొని బలవన్మరణానికి యత్నించారు. కోవిడ్ -19 సంక్షోభం మధ్య పని లేకపోవడం వల్ల సువో చక్రవర్తి ఆందోళన చెంది ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్నాడు. ఈ సమయంలో తల్లి, సొందరి ఇంట్లోనే ఉన్నారు. కానీ చక్రవర్తి ఏమి చేస్తున్నాడో వాళ్లకు తెలియలేదు. ఫేస్‌బుక్ లైవ్‌లో ‘నేను నిష్కమిస్తున్నాను’ అనే క్యాప్షన్ పెట్టి పాట పాడుతూ గిటార్ వాయిస్తూ సువో చక్రవర్తి నిద్రమాత్రలు మింగారు. సువో చక్రవర్తి లైవ్ ఫేస్‌బుక్ ఫాలో అయిన ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫేస్‌బుక్‌ లైవ్‌ లోకేషన్‌ ద్వారా చక్రవర్తిని ఇంటికి వెళ్లి అతన్ని పోలీసులు రక్షించారు. కాగా సువో చక్రవర్తి ‘మంగల్ చండి’, ‘మనసా’ సీరియళ్లలో నటించారు.

తమ ఇంట్లో సమస్యలు ఉన్నాయని చక్రవర్తి తల్లి తెలిపారు. తన కొడుకు నిరుద్యోగి అని చెప్పారు. గత సంవత్సరం తన భర్త చనిపోయారని తెలిపారు. తనకు వచ్చే పింఛన్ డబ్బులతోనే ఇల్లు గడుస్తోందని ఆమె చెప్పారు.  ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తమను ఆదుకోవాలని కోరారు.