మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. తొలిసారి పట్టుబడిన వారికి జరిమానా తో పాటు జైలు శిక్ష, తరచూ పట్టుబడుతున్న వారికి జైలుశిక్షతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు పోలీసులు. అయితే మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన డ్రైవర్లకు కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పారు తెలంగాణ పోలీసులు.
వైఎస్ఆర్ ఇలాంటి కేసుల్లో చిక్కున్న వారికి ఉపశమనం కలిగించే చర్యలు ప్రారంభించారు. జైలు శిక్షలు కాకుండా కేవలం జరిమానా తో సరిపెట్టాడు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల 21వ తేదీన మెగా లోక్ అదాలత్ ను పురస్కరించుకొని ఇలాంటి కేసులను కొలిక్కి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కినా ఏళ్ల తరబడి కేసులు కొలిక్కిరాని నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ నిబంధనను తెలంగాణ పోలీసులు అమలు చేస్తే.. దాదాపు లక్ష మంది మందుబాబులకు ఊరట కలిగింది.