రూ.25 వేల కంటే తక్కువ వేతనం ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఆలా చేస్తే విద్య, వైద్యం, పెళ్లికి డబ్బులు ఫ్రీ..!

-

అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తక్కవ వేతనం పొందుతున్న ఉద్యోగుల లబ్ది కోసం కొన్ని ప్రత్యేకమైన వెల్ఫేర్ ఫండ్ స్కీమ్స్ అందిస్తూనే ఉంటాయి. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల తక్కువ మొత్తంతోనే అనేక రకాల ప్రయోజనాలు వారు పొందొచ్చు. ఉద్యోగం చేస్తున్న వారందరికీ ఒకేలా జీతాలు రావు. చేసే పని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన వేతనం పొందుతారు. దేశంలో ఇలా అనేక మంది తక్కువ వేతనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. నెలకు రూ.25 వేలకు లోపు జీతం తీసుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

అయితే ఇలా తక్కువ జీతం వస్తోందని వారు నిరాశ పడనవసరం లేదు. తక్కువ జీతం పొందే వారికి కొన్ని రకాల సౌకర్యాలు ఉచితంగానే పొందొచ్చు. ముఖ్యంగా విద్య, వైద్యం, పెళ్లి వంటి వాటికి ఉచితంగా డబ్బులు పొందొచ్చు. అయితే దీని కోసం వారు రూ.25 చెల్లించాల్సి వస్తుంది.కానీ వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. పలు రాష్ట్రాల్లో ఇలాంటి స్కీమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం హరియాణ ప్రభుత్వం అందించే ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. ప్రతి నెల ప్రభుత్వం వారు అందించే సంక్షేమ పథకంలో రూ.75 డిపాజిట్ చెయ్యాలి. ఇందులో రూ.25 ఉద్యోగుల వేతనం నుండే డైరెక్టుగా కట్ అవుతుంది. ఇక మిగిలిన రూ.50 కంపెనీ మేనేజ్‌మెంట్ చెల్లిస్తుంది. మహిళ ఉద్యోగులకు వారు పెళ్లి చేసుకుంటే రూ.51,000 లభిస్తాయి. అదే మహిళలకు ఆడ పిల్లలు ఉంటే వారి పెళ్లిళ్లకు కూడా ఇంతే మొత్తం లభిస్తుంది. ఒక్క కుటుంబంలో ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఈ డబ్బులు వస్తాయి. పెళ్లికి ముడు రోజులు ముందే ఈ డబ్బులు వారికి లభిస్తాయి. అలాగే మహిళలు డెలివరీ అయితే రూ.10,000 అందచేస్తారు. అలాగే వారి పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. పని చేసేటప్పుడు వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షలు బీమా డబ్బులు అందిస్తారు. అలాగే వికలాంగులకు త్రివీలర్ కొనుగోలు చేసుకోడానికి రూ.7,000 లభిస్తాయి. ఒకవేళ పని చేస్తూ వర్కర్లు మరణిస్తే.. రూ.5 లక్షల ప్రమాద బీమా తమ కుటుంబాలకి అందిస్తారు. అదే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఇంటర్ వరకు ప్రతి సంవత్సరం రూ.4000 వరకు పొందవచ్చు .స్కూల్ యూనిఫామ్, బుక్స్ వంటి వాటికి ఈ డబ్బులను అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news