ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే నిరుద్యోగ సమస్యలను తీర్చెందుకు పలు విభాగాలలో పోస్టులను భర్థీ చేస్తున్నారు..తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.విజయవాడలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.ఎలా అప్లై చేయ్యాలి వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు,అర్హతలు:
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 823 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌లో (635), ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో (188) పోస్టులు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం:
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన,అర్హత కలిగిన వాళ్ళు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..
అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 61,960 జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 06-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు…
ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఉద్యోగాలను అందిస్తూ వస్తుంది..ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు నిరుద్యోగ సమస్య తీరుతుందని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.. 2 రోజులే గడువు ఉండటంతో ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు.