బీటెక్ చదివిన వారికి గుడ్ న్యూస్..భారీ జాబ్ ఆఫర్స్..ఒక్క రోజే ఛాన్స్..

-

బీటెక్ చదివిన వారికి ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి..ఇటీవల ఖాళీలు ఉన్న పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు..ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు.

మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. దరఖాస్తుకు వచ్చే నెల 3ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ bel-india.inలో ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్హతలు:

నాలుగేళ్ల బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇతర అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులు సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారి వయస్సు ఆగస్టు 1 నాటికి 28 ఏళ్ళ వయస్సును కలిగి ఉండాలి.ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి..

ఎలా అప్లై చేసుకోవాలి?

*. అభ్యర్థులు మొదటగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ www.bel-india.inను ఓపెన్ చేయాలి.
*. హోం పేజీలో Career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
*. తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
*. కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
*. దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వారంతా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను చెక్ చేసి అప్లై చేసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news