ఆరోగ్య సేతు యాప్.. మన దేశంలో కరోన ఎప్పుడు అయితే అడుగు పెట్టిందో అక్కడి నుంచి కూడా అది కూడా ప్రతీ ఇంట్లోకి వెళ్ళింది. నెల రోజుల్లో కోట్ల మంది దానిని తమ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్నారు. దీనితో చాలా మందిలో కాస్త ఆందోళనకర వాతావరణం వచ్చింది. అది ఏంటీ అంటే… అసలు యాప్ లో భద్రత సేఫ్ గా ఉంటుందా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి.
యాప్ లో భద్రతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా భయపడాల్సిన అవసరం లేదు… అందులో మీ డేటా కు ఏ మాత్రం భయం లేదని చెప్పింది. ఇక తాజాగా మరో కీలక ప్రకటన చేసింది… ఒక ఫీచర్ ని అందులో తీసుకొచ్చారు. ఏంటీ అంటే ఇప్పటి వరకు ఆరోగ్య సేతు యాప్‌లో స్టోర్ అయిన డేటా మొత్తం డిలీట్ చేసుకోవచ్చు. అకౌంట్ తో పాటుగా డేటా కూడా డిలీట్ చేసుకోవచ్చు. కాని మీ డేటా మాత్రం ప్రభుత్వం వద్ద ఉంటుంది. 30 రోజుల తర్వాత అక్కడ డిలీట్ అవుతుంది.