రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఆహారం సరఫరా పున : ప్రారంభం

-

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన సంగతి మనందరికీ తెలిసిందే. చాలా రైళ్లు కరోనా కారణంగా రద్దు చేయబడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో…. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. రైల్వేశాఖ పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు రైళ్ల సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో రైల్వే ప్రయాణికులకు తీపి కబుర్లు చెప్పింది రైల్వే శాఖ.

రాజధాని, దురంతో, శతాబ్ది, వందే భారత్, తేజస్, గతిమాన్‌ రైలు ప్రయాణీకులకు శుభ వార్త చెప్పింది. అన్ని రైళ్లలో ఆహార సరఫరా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తూ.. రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కారణంగా నిలిపి వేసిన సౌకర్యాన్ని పునరుద్దరిస్తూ.. ఇటీవల నిర్ణయం తీసుకుంది. కరోనా జాగ్రత్తలతో… రైళ్లలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సిటిసి, అన్ని జోన్ల కమర్షియల్‌ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది రైల్వే బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news