రైతులు వరి వేయొద్దు.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు !!

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంట వేయడం అలాగే ధాన్యం కొనుగోలు అంశంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వరి పంట వేయొద్దు అని తెలంగాణ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టి చెబుతుంటే… వరి పని చేయాలని రాష్ట్ర బిజెపి పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని… అందుకే తాము వారి వేయొద్దని చెబుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పేర్కొంటోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా తాము ధాన్యం కొనుగోలు చేయబోమని లేఖ ద్వారా స్పష్టం చేసింది.

ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వరి పంటపై.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కీలక సూచనలు చేశారు. ఏపీలో బోర్ల వద్ద వరి పంట వేయొద్దని రైతులను అభ్యర్థిస్తూ ఉన్నట్లు మంత్రి కన్నబాబు కోరారు. శాసనసభలో మంగళవారం శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ… ” వరి పంటకు నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆదాయం తక్కువ వస్తుంది. వరి కంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్నా పంటలను వేయాలి. ఈ దిశగా రైతులకు శిక్షణ ఇస్తున్నాం” అంటూ మంత్రి కన్నబాబు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news