విశాఖ‌లో ఆన్లైన్ అడ్డాగా గంజాయి దందా…!

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి విచ్చ‌ల‌విడిగా దొర‌కడంపై ప్ర‌భుత్వాలు దృష్టి పెట్టాయి. గంజాయి కార‌ణంగా నేరాలు పెర‌గుతుండ‌టంతో గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇక ఏపీ లో విశాఖ కేంద్రంగా గంజాయి పెద్ద ఎత్తున ర‌వాణా జ‌రుగుతున్న‌ట్టు ముందు నుండి ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విశాఖ నుండి గంజాయి స‌ర‌ఫరా అవుతుంద‌ని తెలంగాణ పోలీసులు సైతం వెళ్లి విచారించారు. రెండు రాష్ట్రాల పోలీసులు క‌లిసి జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వహించారు.

ఇక తాజాగా విశాఖ‌ప‌ట్నంలో ఆన్లైన్ అడ్డాగా గంజాయి విక్ర‌యిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. విశాఖ నుండి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు గంజాయి స‌ర‌ఫరా అవుతున్న‌ట్టు గుర్తించారు. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బెండీలో కేసు న‌మోదు కాగా మ‌ధ్య ప్ర‌దేశ్ పోలీసులు విశాఖ చేరుకున్నారు. గంజాయి స‌ర‌ఫరా చేస్తున్న విశాఖ‌లోని అన్లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మ‌రో ఇద్ద‌రు నింధితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క‌రివేపాకు..హెర్బ‌ల్ ప్రోడ‌క్ట్ ల పేరుతో గంజ‌యిని అమ్ముతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.