మహిళలకి గుడ్ న్యూస్.. రూ. 3 లక్షల లోన్.. వడ్డీ కూడా లేదు..!

-

చాలా మంది ఈ రోజుల్లో వివిధ రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అలానే ఇతర ఆదాయ వనరులపై ఆధారపడుతున్నారు కూడా. వ్యాపారం చేసేవాళ్లు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. వ్యాపారం చేసే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించేందుకే ఓ స్కీము ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల వరకు లోన్ వస్తోంది. ప్రభుత్వం సూచించిన 88 రకాల వ్యాపారాల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని డబ్బులు తీసుకోవచ్చు. వివరాలు చూస్తే.. అంగవైకల్యం, వితంతువులకు దీనిలో లోన్ లిమిట్ లేదు.

అర్హతలు, పెట్టే వ్యాపారాన్ని బట్టి లోన్ వస్తోంది. మహిళలు తమ కాళ్లపై ఈ స్కీము తో నిలబడవచ్చు. కేంద్రం ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా కూడా తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంత మహిళల కోసమే ప్రత్యేకంగా దీన్ని తీసుకు వచ్చారు. పేదలు, నిరక్షరాస్య నుంచి వచ్చిన మహిళలు ఈ స్కీం ద్వారా మద్దతు పొందుతారు. ఇప్పటి దాకా 48 వేల మందికిపైగా మహిళలు లబ్ధి పొంది వ్యాపారాలు చేస్తున్నారు.

మహిళలకు మాత్రం 10 నుంచి 12 శాతం వడ్డీ తో లోన్ ఇస్తారు. బ్యాంకులను బట్టి ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.18 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఇందుకు అర్హులే. కుటుంబ సంవత్సర ఆదాయం తప్పనిసరిగా రూ.1.50 లక్షలకు మించి వుండకూడదు. అవసరమైన లోన్ మొత్తం కూడా రూ. 3 లక్షలకు మించకూడదు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే లోన్ ఇస్తారు. అన్ని డాక్యుమెంట్లతో దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి ఈ స్కీము కోసం దరఖాస్తు చేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news