దేశంలో నాలుగో అతి పెద్ద బ్యాంకు యస్ బ్యాంకు కి మరో లైఫ్ లభించింది. 3 ఏప్రిల్ 2020 వరకు ప్రకటించిన నిషేధం రెండు వారాల ముందు ఎత్తి వేసిన తర్వాత ఆ బ్యాంకు కి మరో గుడ్ న్యూస్ అందించారు. దీనితో, సమస్యాత్మక రుణదాతలుగా ఉన్న వినియోగదారులు ఉపశమనం పొందనున్నారు. ఖాతాలపై విత్ డ్రా పరిమితిని ఎత్తివేశారు. అలాగే సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెడు రుణాలు పెరగడంతో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా… ఎస్ బ్యాంకు పై తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. భారీ నగదు ప్రవాహాన్ని తనిఖీ చేయడానికి రూ .50 వేల విత్ డ్రాలపై నిఘా ఉంచారు. రానా కపూర్ స్థాపించిన ఈ బ్యాంకుపై ఆర్‌బిఐ తాత్కాలిక నిషేధం విధించిన తరువాత షేర్లు ఒక్కొక్కటి 5.55 రూపాయలకు పడిపోయాయి.
దీనితో 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించి, భారతీయ స్టేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. విత్ డ్రాలపై ప్రశాంత్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేసారు. కస్టమర్ ల విత్ డ్రా లపై అధ్యయనం చేసామని, మూడింట ఒకవంతు కస్టమర్లు మాత్రమే రూ .50 వేలు ఉపసంహరించుకున్నారని వివరించారు.