అమరావతి : గతేడాది పదో తరగతి పాసైన విద్యార్థుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది పదో తరగతి పాసైన విద్యార్థులకూ గ్రేడ్లు ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గత ఏడాది టెన్త్ విద్యార్ధులందరూ ఆల్ పాస్ అని ప్రకటించింది సర్కార్.
పోటీ పరీక్షల్లో విద్యార్ధులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఆల్ పాస్ విధానాన్ని సవరించి గ్రేడ్లు ఖరారు చేస్తూ గతేడాది టెన్త్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనుంది ఏపీ విద్యా శాఖ. ఫార్మెటీవ్, సమ్మేటీవ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ప్రకటించనుంది నిపుణుల కమిటీ.
పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు తమకు గ్రేడ్‌లు ఇవ్వాల్సిందిగా గతేడాది టెన్త్ విద్యార్తులు పాఠశాల విద్యా శాఖ కోరుతోన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది టెన్త్ పాసైన విద్యార్థులకు త్వరలోనే గ్రేడింగ్ లు ప్రకటించేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తు మొదలు పెట్టింది.