చిత్ర పరిశ్రమకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత న BRK భవన్ లో సినీ ఎగ్జిబిటర్స్ సమస్యల పై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. షో ప్రదర్శనకు అనుమతి, లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిద రకాల పన్నులను రద్దు చేయటం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు సినీ ఎగ్జిబిటర్స్.
ఈ సమావేశం అనంతరం సి.కళ్యాణ్ మాట్లాడుతూ…థియేటర్ల కరంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరామని…కరెంట్ బిల్లుల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.
ఎగ్జిబిటర్స్ మిగతా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం పై చాలా ఆనందంగా ఉందని తెలిపారు సి. కళ్యాణ్. కాగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా… థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది.