కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. ఇంకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగవచ్చు అని మీడియా వర్గాల నుంచి వినిపిస్తోంది. డియర్ నెస్ అలోవెన్స్(డీఏ), ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను త్వరలో పెంచాలనే ఆలోచన లో వుంది కేంద్రం. దీని వలన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 26,000 వరకూ పెరగవచ్చు. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంకా రాలేదు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. కొన్ని మీడియా నివేదికల ప్రకారం పెరగనున్న డియర్ నెస్ అలోవెన్స్(డీఏ), ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ వివరాలు ఈ విధంగా వున్నాయి.
ధారణ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం 2.57 శాతం వుంది. బేసిక్ పే రూ. 15,500 ఉంటే గ్రేడ్ పే 4200 ఇక జీతం 15,500*2.57, రూ. 39,835 అవుతుంది. ఆరో వేతన సవరణ కమిషనర్ ఫిట్ మెంట్ రేషియో 1.6గా వుంది. ఉద్యోగి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68శాతానికి చేరుతుంది. కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 26,000గా ఉంటుంది.
రెండు సార్లు ప్రతీ సంవత్సరం డియర్ నెస్ అలోవెన్స్(డీఏ). డియర్ నెస్ రిలీఫ్(డీఆర్) ని సవరిస్తూ వుంటారు. మీడియా రిపోర్టుల ప్రకారం జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం మరో 4శాతం డియర్ నెస్ అలోవెన్స్ ను పెంచవచ్చు. మార్చి నెలలో డీఏ ను 4శాతం పెంచారు. జనవరి 1, 2023 నుంచి ఇది అమలవుతోంది. డీఏ 42 శాతానికి పెరిగింది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కాక, డీఏను కూడా జూలై ఒకటి నుంచి పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.