భారీగా పడిపోయిన ధర..4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు

-

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మామిడికాయల సీజన్‌ నడుస్తోంది. ఈ ఎండా కాలం మొత్తం.. మామిడికాయలే తింటారు. ఇక ఈ సీజన్‌ అయినపోతున్న తరుణంలో… మామిడికాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచాడు ఓ రైతు.

ఏలూరు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను రైతు బెక్కం రాజగోపాల్…దారినపోయే వారికి పంచిపెట్టారు. ఆకాల వర్షాలతో మామిడికాయలు రంగు మారాయంటూ రైతుకు గిట్టుబాటుధర రాకపోవడం, మరో వైపు దళారీల దోపిడీ తట్టుకోలేక తీవ్ర నిరాశతో పండించిన మామిడి పంటను ఉచితంగా ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news