God Father: ప్రభుదేవా కొరియోగ్రఫీలో సల్మాన్ భాయ్, చిరంజీవి స్టెప్స్..మెగా అభిమానులకు పండుగే

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం గత నెల 29న విడుదలైంది. ఈ పిక్చర్ లో తండ్రీ తనయులు చిరు, చరణ్ ల గ్రేస్ ఫుల్ స్టె్ప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. భలే భలే బంజారా సాంగ్ లో రామ్ చరణ్, చిరంజీవి స్టెప్స్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కాగా, తాజాగా మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పేశారు మెగాస్టార్ చిరు.

 

డ్యాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో ‘గాడ్ ఫాదర్’లో ఓ సాంగ్ ఉండబోతున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎస్.ఎస్.థమన్, చిరంజీవి, ప్రభుదేవా, మోహన్ రాజా కలిసి దిగిన ఫొటో ఒకటి షేర్ చేసి ఈ విషయం అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఈ పాటలో బాలీవుడ్ మెగస్టార్ సల్మాన్ ఖాన్ ఉండటం విశేషం. అలా ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్..ఇద్దరూ ఈ పాటకు స్టెప్పులేయనున్నారు. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డ్యాన్సింగ్ డైనమైట్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో రాబోయే ఈ సాంగ్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే మెగాస్టార్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. తాజాగా సీనియర్ హీరోయిన్ రాధిక ప్రొడక్షన్ హౌజ్ లో నూ ఓ మూవీ చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలొస్తున్నాయి.

మరో వైపున ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య,’ సినిమాలతో వెంకీ కుడుములతో మూవీ చేస్తున్నారు చిరు. ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్. ఇందులో సల్లూభాయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

https://www.instagram.com/p/CdFMHzYvP-V/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news