ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్దంపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పర్యటనలో భాగంగా నిన్న జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో ఎవరూ విజేతలు ఉండరని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం తర్వాత చివరికి మిగిలేదది పెను విషాదం, దానిని అందరూ కలిసి అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి ఇరు దేశాలు తక్షణమే తమ వైరాన్ని పక్కన పెట్టి యుద్దానికి ముగింపు పలకాలని కోరారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని, ఇదే విషయాన్ని భారత్ తొలి నుంచి చెబుతోందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై యుద్ధ ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉందని అన్నారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ మాట్లాడుతూ… రష్యాపై పలు ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ న్యాయ నిబంధనల ఉల్లంఘనకు రష్యా పాల్పడిందని ఫైర్ అయ్యారు.