శ్రీహరి మరణం ఆయనకు ముందే తెలుసా..?

-

మిస్టర్ హైదరాబాద్ గా టైక్వాండో లో ఏకంగా మెడల్స్ ను సాధించిన శ్రీహరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూపు లేకుండా ఎంతటి క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలలో అయినా సరే ఈయన సునాయాసంగా పూర్తి చేయగలరు. అందుకే శ్రీహరి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట విలన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన శ్రీహరి ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతోపాటు యాక్షన్ డ్రామా చిత్రాలను కూడా తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. అంతే కాదు ప్రముఖ ఐటమ్ గర్ల్ అయినటువంటి డిస్కోశాంతి ని వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచారు.Srihari: A master of character rolesఇకపోతే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీహరి.. ఉన్నట్టుండి మరణించడంతో సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేక పోయింది. కొన్ని సంవత్సరాలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హరికృష్ణ ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. అలా ఉన్నట్టుండి మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీహరి మరణానికి గల కారణాలను ప్రముఖ సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఒక మీడియాతో వెల్లడించారు. భరద్వాజ్ మాట్లాడుతూ శ్రీహరి కి ముందే తన మరణం గురించి ముందే తెలుసునని..ఎక్కువ కాలం బ్రతకను అనుకున్న నేపథ్యంలోని సినిమాలు తక్కువగా చేసుకుంటూ వచ్చాడు అని భరద్వాజ్ వెల్లడించారు.Docs bungled Srihari's case: Wife

సత్యమేవ జయతే అనే షో ను శ్రీహరి తో చేయాలని అనుకున్నారు. కానీ శ్రీహరి తన ఆరోగ్యం గురించి తెలిసి నో చెప్పారట. వేర్వేరు కారణాల వల్ల శ్రీహరికి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని భరద్వాజ్ వెల్లడించారు. వంగవీటి రంగా సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ హరి.. దాసరి నారాయణరావు నేతృత్వంలో సినిమాలలో నటించాడు. ఆ తర్వాత వరుసగా డైరెక్టర్లు శ్రీహరికి అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు . ఇక తన మేనరిజంతో డిఫరెంట్ లుక్ తో శ్రీహరి నటన ను అందరు గమనించి ఆ తర్వాత ఈ వీ వీ సత్యనారాయణ కూడా తన సినిమాలో అవకాశం ఇచ్చారని సమాచారం. ఇక మగధీర సినిమాలో రాజమౌళి ఇచ్చిన పాత్రకు గానూ శ్రీహరి పూర్తి న్యాయం చేసాడు అని భరద్వాజ్ వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news