ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్ తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని వాహనాల వాళ్ళు ఫాస్టాగ్ కొనుగోలు చేశారు. ఒకవేళ ఫాస్టాగ్ లేకపోయినట్లయితే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు డబ్బు వసూలు చేస్తూ ఉండడంతో కాస్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని చెప్పక తప్పదు. అయితే ఇంకా ఫాస్టాగ్ కొనుగోలు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్త చెప్పింది..
అదే మంటే మార్చి ఒకటో తేదీ దాకా దేశంలోని డెడ్ 770 టోల్ ప్లాజాల వద్ద బ్యాంకులు ఉచితంగా ఫాస్టాగ్ లను అందించనున్నాయి. కేవలం బ్యాంకులో అందించిన ఫాస్టాగ్ లను వినియోగదారులు రీఛార్జి చేసుకుంటే సరి పోతుంది. ఇక ఫాస్ట్ ట్రాక్ వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తాజాగా కేంద్రం వెల్లడించింది. అంతే కాక గత రెండు రోజులుగా 87 శాతం వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరిగాయని పేర్కొంది. కేవలం 13 శాతం మాత్రమే నగదు చెల్లింపులు జరిగాయని పేర్కొంది.