దేశ దిగ్గజ బ్యాంకింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త స్కీములని తీసుకు వస్తూనే ఉంటుంది. సదరు స్కీముల ద్వారా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. కస్టమర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఓ అద్భుతమైన స్కీమును తీసుకు వచ్చింది. మరి ఇక ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆ స్కీము తో నెల నెలా దాదాపు 11 వేల రూపాయలు పొందొచ్చు.
ఆ స్కీము పేరు ఎస్‌బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్. ఇక ఈ స్కీము కోసం పూర్తి వివరాలని చూసేద్దాం. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీములో చేరితే మంచి రాబడి వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీము ఎంతో బాగుంటుంది. ఎస్‌బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీము తో వడ్డీతో పాటు పెట్టుబడిగా పెట్టిన దానిలో కొంత భాగాన్ని ఇస్తారు. యాన్యూటీ డిపాజిట్ స్కీము చాలా బెస్ట్ స్కీమ్.
ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్‌లో మీరు 10 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే మీకు నెలకు 11, 870 రూపాయలు వస్తాయి. తొలి నెల వడ్డీ 6250 రూపాయలు వుంది. పెట్టుబడిగా పెట్టిన మొత్తంలో కొంత భాగం 5620 రూపాయలు మీరు పొందవచ్చు. ఈ యాన్యుటీ ప్లాన్ టెన్యూర్ 10 ఏళ్లు ఉంటుంది. మీడియం టర్మ్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్.
పైగా ఈ స్కీము తో సెక్షన్ 80టీటీబీ కింద పన్ను మినహాయింపు ని కూడా పొందవచ్చు.