సమంతతో కిస్ పై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు

-

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం కలిగిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ తరుణంలోనే ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు నాగచైతన్య.

కాగా, కస్టడీ’ చిత్ర ప్రమోషన్స్ లో హీరో నాగచైతన్య తన ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ పై స్పందించారు. ‘ఏడవ తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి నా క్లాస్మేట్ ని ఇష్టపడ్డా. ఇంటర్లో ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్ కు వెళ్ళా. ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ‘ఏ మాయ చేసావే’ సినిమాలో జరిగింది. ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఎప్పుడు అనేది చెప్పాలనుకోవడం లేదు’ అని చెప్పారు. చైతు, సమంత నటించిన ‘ఏ మాయ చేసావే’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news