స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల ద్వారా చాలా మందికి ప్రయోజనకరంగా వుంది. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్, యోనో యాప్లలో వినియోగదారుల ఖాతా డీటెయిల్స్ ని ఇస్తోంది. టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా వివరాలని అందిస్తోంది స్టేట్ బ్యాంక్.
అయితే మినీ స్టేట్‌మెంట్‌ను కూడా మిస్డ్ కాల్ ద్వారా వచ్చేలా ఏర్పాట్లు చేసింది ఈ బ్యాంకు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. అత్యాధునిక సాంకేతికతో సర్వీసులని అందిస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్. ఆన్ లైన్, యోనో యాప్ లలో వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన వివరాలు ఇస్తోంది బ్యాంకు. టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ వంటి వాటి ద్వారా కూడా ఖాతా బ్యాలెన్స్ వివరాలు ఇస్తోంది.
ఇక మీదట మీరు మినీ స్టేట్‌మెంట్‌ను కూడా మిస్డ్ కాల్ ద్వారా పొందొచ్చు. ఎస్బీఐ క్విక్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ తో మినీ-స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. కస్టమర్స్ వారి ఫోన్ నెంబర్ ని లింక్ చేయించుకోవాలి.
అప్పుడే ఈ ఫీచర్ అవుతుంది. NEFT, RTGS, IMPS, UPI వంటి వివిధ మోడ్‌ల ద్వారా నిర్వహించబడే అన్ని ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి. బ్యాలెన్స్ వివరాలను స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు పొందాలంటే ఎస్బీఐ టోల్-ఫ్రీ నంబర్ 9223766666 ద్వారా తెలుసుకోవచ్చు. గత 5 లావాదేవీల మినీ స్టేట్ మెంట్ తెలుసుకోవడానికి 09223866666కి మిస్డ్ కాల్ ఇవ్వండి.