కరోనా ఉన్నా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఓటేసిన బీహారీలు

-

బీహార్‌లో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నా బీహారీలు ఎక్కడా వెనకడుగు వేయకుండా అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ లో భారీ ఎత్తున పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గరా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి కనిపించారు. సాయంత్రం ఐదు గంటల దాకా పోలయిన దాన్ని బట్టి 52.24% వోట్లు పోలయ్యాయి. ఒక రకంగా ఇది ఎక్కువనే చెప్పాలి.

ఎందుకంటే 2015, మొదటి దశలో 54.94%, పోలవ్వగా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 53.54% పోలయ్యాయి. ఇక ఆరు గంటలకి క్యూలో ఉన్నవారిని కూడా వోట్ వేయడానికి అనుమతించారు. దీంతో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పని సరి చేయగా వచ్చిన ఓటర్లందరినీ థెర్మల్ స్క్రీనింగ్ చేసి వోటు వేయడానికి అనుమతించారు. ఇక కరోనా లక్షణాలు ఉన్న వారు, అలానే 80 ఏళ్లకు పైబడిన వారికి మాత్రం పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news