గూగుల్‌ సంస్థపై రూ.4 కోట్ల జరిమానా విధింపు.. ఎందుకంటే..?

-

ప్రముఖ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌ ఛానెల్‌లో వైరల్ అయిన వీడియో కారణంగా.. అతడి రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశంలో జరిగింది. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ.. జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టాడు.

గూగుల్
గూగుల్

ఎలాంటి ఆధారాలు లేకుండా.. జాన్‌పై జోర్డాన్ అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడంతో.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జాన్ బరిలారో రాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే ఈ విషయంపై ఆయన ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి న్యాయం అందించాలని కోరారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. సోమవారం తీర్పును వెల్లడించింది. అయితే జాన్‌కు వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వీడియోల ద్వారా గూగుల్ వేలాది డాలర్లు సంపాదించిందని అభిప్రాయపడింది. ఈ మేరకు 7,15,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. కాగా, ఈ తీర్పుపై గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news