గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా…?ఇప్పుడు మరింత జాగ్రత్త…!

-

ఒక పక్క కరోనా వైరస్ దెబ్బకు జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే కొందరు మాత్రం వాళ్ళను వేధించే కార్యక్రమాలు చేస్తున్నారు. అసలే దేశంలో ఆర్ధిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఇబ్బందులకు కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ప్రతీ రూపాయి కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాని ఇలాంటి తరుణంలో కొందరు ప్రజలను టార్గెట్ చేసారు.

వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు జీవితం అంటే భయపెట్టే విధంగా చేస్తున్నారు. ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. వేలాది మంది వాటిని వాడుతున్నారు. ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి వాటి ద్వారా జనాలను నాశనం చేస్తున్నారు. మీ ఎకౌంటు క్లోజ్ అయిందని చెప్తూ మెసేజ్ చేస్తున్నారు.

వెంటనే రీ యాక్టివేట్ చేసుకోవాలని మరో సందేశం పంపిస్తున్నారు. అకౌంట్ యాక్టివేట్ అయ్యేందుకు ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా యాప్‌ల సహాయంతో ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఖాతాల్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తున్నారు. పేటీఎం సంస్థ అకారణంగా ఖాతాను నిలుపుదల చేయదని, ఒకవేళ ఖాతా నిలిచిపోయినా యాప్‌లోని కస్టమర్ కేర్ సర్వీస్‌ను మాత్రమే సంప్రదించాలని సంస్థ సూచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news