BREAKING : రష్యాకు గూగుల్‌ షాక్‌..అన్ని ప్రకటనలు రద్దు చేస్తూ నిర్ణయం

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య భారీ స్థాయిలో ఉద్యమం జరుగుతోంది. తొమ్మిదో రోజు కూడా ఈ రెండు దేశాల మధ్య భీకరంగా పోరాటం సాగుతోంది. రెండు దేశాలు ఎక్కడా తగ్గకుండా… యుద్దం కొనసాగిస్తూనే ఉన్నాయి. శాంతి చర్చల్లో కూడా ఎవరు తగ్గడం లేదు. ఈ నేపథ్యం లో రష్యాకు గూగుల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. అన్ని సోషల్‌ మీడియాలలో యాడ్స్‌ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది గూగుల్‌ సంస్థ.

ముఖ్యంగా యూట్యూబ్, ట్విట్టర్‌, స్నాప్‌ చాట్‌ తదితర సోషల్ మీడియా, డిజిటర్‌ మీడియాలలో.. వచ్చే ప్రకటనలను ప్రస్తుతం రద్దు చేస్తున్నట్లు కాసేపటి క్రితమే ప్రకటన చేసింది గూగుల్‌ సంస్థ. దీంతో.. రష్యా దేశానికి వచ్చే గూగుల్‌ యాడ్స్‌ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. “అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, రష్యాలో Google ప్రకటనలను పాజ్ చేస్తున్నాము” అని గూగుల్‌ కంపెనీ ఒక ప్రకటన లో తెలిపింది. అక్కడి పరిస్థితులు సద్దుమనిగిన తర్వాత యథావిధంగా ప్రకటనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది గూగుల్‌.

Read more RELATED
Recommended to you

Latest news