గోపీచంద్ – మారుతి టైటిల్ ఫిక్స్… పక్కా కమర్షియల్ !

Join Our Community
follow manalokam on social media

టాలీవుడ్ మ్యాచొ స్టార్ గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది..అధికారిక ప్రకటన వెలువడింది కానీ ఈ సినిమా టైటిల్ గానీ మరే ఇతర వివరాలు గానీ వెల్లడించలేదు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొద్ది సేపటి క్రితం ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకి పక్కా కమర్షియల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ అయిదో తారీకు మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక ఈ సినిమాను అక్టోబరు ఒకటో తారీకున విడుదల చేస్తున్నామని కూడా యూనిట్ ప్రకటించింది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్ని వాసు, వంశీలు గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అలానే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపిక అయింది అని అంటున్నారు దాని మీద మాత్రం అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....