ప్రజారోగ్యం పట్ల సర్కారు నిర్లక్ష్యం: చల్లా వంశీచంద్ రెడ్డి

-

ప్రజలకి వైద్యం సరిగ్గా అందడం లేదని వైద్యం అభివృద్ధి సరిగ్గా జరగడం లేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ విషయం పైన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ కరువైందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా వాళ్ళు ప్రారంభం చెయ్యలేదని తీవ్రంగా విమర్శించారు. అదనంగా రాష్ట్రంలో మరో 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 125 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవసరమని చల్లా వంశీ చంద్ ‌రెడ్డి చెప్పారు.

 

challa reddy

అంతే కాకుండా ఆరోగ్య కేంద్రాలలో, ఆసుపత్రుల్లో దాదాపు 40 శాతం ఖాళీలు భర్తీ కావలసి ఉందని చెప్పారు. విద్యార్ధులకి పరీక్షలు పూర్తి అయ్యి పోస్టులకు మూడు సంవత్సరాలు గడిచినా నియామకాలు చేపట్టని అసమర్ధ ప్రభుత్వం ఇది అని తీర్వంగా విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ప్రభుత్వం పరోక్షంగా సహాయం అందిస్తోంది అని ఆరోపించారు. కోట్లాది మంది ప్రాణాలని లెక్కజేయని అసమర్ధ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version