మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. నైట్ క‌ర్ఫ్యూ

-

మ‌హారాష్ట్ర లో రోజు రోజుకు క‌రోనా, ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా భారీ సంఖ్య‌లో 41,434 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 10 వ తేదీ నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమలులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. నైట్ క‌ర్ఫ్యూ రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల‌కు ఉంటుంద‌ని తెలిపింది. ఈ స‌మయంలో 5 గురుకి మించి బ‌య‌ట ఉండ‌రాద‌ని సూచించింది. నైట్ క‌ర్ఫ్యూ తో పాటు ప‌లు క‌ఠిన ఆంక్ష‌లు కూడా అమలు చేయ‌డానికి సిద్ధం అవుతుంది.

అలాగే స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్‌లు, స్పాలు, బ్యూటీ సెలూన్ లు జూ పార్క్ లు, మ్యూజియంలు, పార్కులు మూసి ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. హెయిర్ సెలూన్స్, రెస్టారెంట్స్, సినిమా థీయేట‌ర్స్, షాపింగ్ మాల్స్ 50 శాతం సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తాయ‌ని ప్ర‌క‌టించింది. అలాగే పెళ్లిలు వంటి శుభ‌కార్యాల‌కు 50 మంది మించ‌కుండా ఉండాల‌ని అంత్య‌క్రియ‌ల‌కు 20 మంది మాత్ర‌మే ఉండాల‌ని తెలిపింది. ప్ర‌భుత్వ బ‌స్సుల‌లో తిర‌గాలంటే.. త‌ప్ప‌కుండా రెండు డోసుల టీకాలు తీసుకోవాల‌ని తెలిపింది. డొమ‌స్టిక్ విమానాల‌లో రాష్ట్రానికి వ‌చ్చే వారు కూడా రెండు డోసుల టీకాతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ రావాల‌ని ప్ర‌కటించింది. ఈ ఆంక్ష‌లు అన్ని కూడా ఈ నెల 10వ తేదీ నుంచి అమ‌లు అవుతాయ‌ని ప్ర‌కటించింది.

Read more RELATED
Recommended to you

Latest news