చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. 2020 నుంచి ఇప్పటివరకు చాలా మంది సినీ నటులు మరణించారు. ఇక తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేష్ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు కాసేపటి క్రితమే మరణించారు.

గత కొన్ని రోజుల నుంచి లివర్    వ్యాధి సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు… కాసేపటి క్రితమే మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఆయన హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు పలు సినిమాల్లో నటించారు. 1974 సంవత్సరంలో వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమాతో రమేష్ బాబు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రమేష్ బాబు… మహేష్ బాబు నటించిన అర్జున్ మరియు అతిథి సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news