ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశం పార్టీ నేతలను అలాగే ఆ పార్టీ మద్దతుదారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ప్రచారానికి తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకొనే నిర్ణయాలు కూడా ఉంటున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే గా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబుకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఈరోజు రెవెన్యూ వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎమ్మెల్యే సొంత స్థలంతో పాటు ఆరు సెంట్ల పోరంబోకు భూమిని ఆయన కలుపుకున్నాడు అని ఆరోపణలు ఉన్నాయి. రిషి కొండ సర్వే నెంబర్ 21 లో షెడ్డు కాంపౌండ్ వాల్ కూడా ఆయన నిర్మించాడు. దీనికి సంబంధించి పలు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించి ఆ ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ భూములు తాము కబ్జా చేయలేదని తమకు వేరే ప్రైవేటు వ్యక్తులు అమ్మారని ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు చెబుతున్నారు.