ఆ సంస్థలకి కేంద్రం శుభవార్త

టెక్ పరిశ్రమకు కేంద్రం శుభ వార్త చెప్పింది. అదేంటంటే ఆ కంపెనీలకి ప్రోత్సాహంలో భాగంగా ఆ కంపెనీలకు ఇక వర్క్ ఫ్రం హోం ని పర్మనెంట్ చేసేలా, సులభతర రిజిస్ట్రేషన్ అలానే అనుమతులని ప్రభుత్వం తొలగించింది. నిన్న ఇండియన్ టెలికాం విభాగం పెద్ద సంస్కరణలకు తెర లేపింది. అదేంటంటే బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌ (బీపీఓ), అలానే నాలెడ్జ్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ (కేపీఓ), కాల్‌సెంటర్లు, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్‌) కంపెనీలకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఈ రంగం మీద ఇప్పటి దాకా ఉన్న అన్ని నిబంధనల భారాన్ని తగ్గించింది.

central government releases ulock 2.0 guidelines

అలాగే.. ఉద్యోగులు ఇంటి నుంచి గానీ, మరెక్కడి నుంచైనా గానీ శాశ్వతంగా పని చేసేందుకు వీలు కల్పించింది. ఇందుకు సంబంధించిన సడలించిన సరళీకృత మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది. ‘భారతదేశంలో వ్యాపారం సులభతరం’ పెంచడానికి మరియు భారతదేశాన్ని టెక్ హబ్‌గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా ఈ చర్యను భావించవచ్చు. ఇక “‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింతగా పెంచడానికి మరియు భారతదేశాన్ని టెక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉంది!” అని ఈ తాజా చర్య గురించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

టెలికాం విభాగం గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం ఇక నుండి ‘వర్క్ ఫ్రం హోం’ని ప్రోత్సహిస్తామని అలానే వర్క్ ఫ్రొం ఎనీ వేర్ ఇన్ ఇండియాని కూడా ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం / వర్క్ ఫ్రం ఎనీ వేర్ అనే ఆప్షన్ కొన్ని సదుపాయాలతో అనుమతించబడుతుంది. ఇది ఇంట్లో నుండి పని చేసే ఏజెంట్లను OSP సెంటర్ యొక్క ‘రిమోట్ ఏజెంట్లుగా’ పరిగణిస్తుందని మరియు ఇంటర్ కనెక్షన్ కి అనుమతించబడిందని చెబుతున్నారు. ఈ “రిమోట్ ఏజెంట్ భారతదేశంలోని ఏ ప్రదేశం నుండి అయినా పని చేయడానికి అనుమతులు ఉంటాయి. అయితే టోల్-బైపాస్‌కు సంబంధించిన ఏదైనా ఉల్లంఘన జరిగితే దానికి OSP బాధ్యత వహిస్తుంది అని మార్గదర్శకాలు చెబుతున్నాయి. గత కొన్ని నెలలుగా, వర్క్ ఫ్రం హోం’ని సులభతరం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. ఇప్పుడు తాజాగా ఐటి, బిపిఓ కంపెనీల్లో రిమోట్ వర్కింగ్ కోసం కనెక్టివిటీ నిబంధనలను డిసెంబర్ 31 వరకు పొడిగించింది.