కేబుల్‌ బ్రిడ్జిపై ఫోటోలు నిషేదించనున్న ప్రభుత్వం ?

-

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పర్యాటకుల సెల్ఫీలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. యువత, మహిళలు రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జి పై శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాకపోకలను నిషేధించారు. వారాంతాల్లో సందడి పెరుగుతోంది. సెల్ఫీల మోజుతో ప్రమాదాలు కొన్నితెచ్చుకుంటున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు పోకిరీలు అయితే కేబుల్ బ్రిడ్జిపైన అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు.

డివైడర్‌ను దాటి రోడ్డు బ్రిడ్జి అంచుల వరకూ వెళ్తున్నారు కొందరు యువకులు. మరికొందరు ఏమో వేగంగా వస్తున్న వాహనాల మధ్య అడ్డ దిడ్డంగా పరుగులు పెడుతున్నారు. సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపై యువకుల హంగామా ఇప్పుడు ప్రమాదకరంగా తయారైంది. రోడ్డు మధ్యలోకి రావొద్దని పోలీసులు చేస్తున్న సూచనలు బేఖాతరు చేస్తున్నారు. దీంతో కేబుల్‌ బ్రిడ్జిపై ఫోటోలు తీయడం నిషేదించే విషయాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళి ఆయన నిర్ణయం మేరకు చర్యలు తీసుకోనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news