కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల

-

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు 2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణాబాబు ఆదేశాలు జారీ చేశారు.2014 ఏప్రిల్ నుంచి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారో ఇక మీదట వారంతా పర్మనెంట్ ఉద్యోగుల విభాగం కిందకు వస్తారు.

ఇక విభాగాల వారీకి సంబంధించిన వివరాలకు వస్తే.. డీఎంఈ పరిధిలో 62 మంది,పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని రెగ్యులరైజ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news