ఏపీలో వాలంటీర్లకి షాక్.. టీడీపీ గెలిచిన చోట్ల ఉద్యోగాలు ఊస్టింగ్ !

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి చివరి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు. పైకి వీరి నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని చెబుతున్నా సరే 90% వాలంటీర్ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇచ్చామని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి గెలిచిన కారణంగా కొంత మంది వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టారు అధికారులు.

వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో టీడీపీ గెలుపొందిన గ్రామాలలో వాలంటీర్లను తొలగించడంతో ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా అద్దంకి మండలం లో టిడిపి మద్దతుదారులు సర్పంచిగా గెలిచిన రెండు గ్రామాల్లో సుమారు పదిమంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. అద్దంకి మండలంలో దేనువకొండ మోదేపల్లి గ్రామాలలో సుమారు పది మంది వాలంటీర్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news