వృద్ధుల కోసం ఆన్‌లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్‌..!

-

భారత ప్రభుత్వం అసంఘటిత రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అయితే దీనిలో భాగంగా “ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ పోర్టల్” తో ఓ ముందడుగు వేసింది. నిరుద్యోగులను, కంపెనీ యాజమాన్యాలను ఒకే చోటకి తీసుకురావడానికే జాబ్ ఎక్స్చేంజ్ పోర్టల్‌కు శ్రీకారం చుట్టింది. ఇక ఈ పోర్టల్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కంపెనీ యాజమాన్యాలకు ఉద్యోగులు దొరికేలా చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

senior citizens

 

సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దీనిని తీసుకు వచ్చింది. ఉద్యోగులు, యజమానులు ఒకరినొకరు వాస్తవంగా కలుసుకుని జాబ్స్ గురించి ఈ పోర్టల్ ద్వారా మాట్లాడచ్చు. అలానే వృద్ధులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. జాబ్ పోర్టల్ అందుబాటులోకి రాగానే సీనియర్ సిటిజన్లు తమ విద్యార్హత, అనుభవం, నైపుణ్యాల వివరాలు సబ్మిట్ చేసి నమోదు చేసుకోవచ్చు.

అలానే జాబ్ ప్రొవైడర్లు పనితో పాటు పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగుల సంఖ్య మొదలైన వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో సీనియర్ సిటిజన్లకు సహాయ పడటానికి స్వచ్ఛంద సంస్థలను తీసుకురావాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కానీ గవర్నమెంట్ పోర్టల్ ఏ ఉద్యోగానికి హామీ ఇవ్వదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉపాధి విషయంలో ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. సీనియర్ సిటిజన్ల సంఖ్య 1951 లో దాదాపు 2 కోట్ల నుంచి 2001 లో 7.6 కోట్లకు.. 2011 లో 10.4 కోట్లకు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news