Samantha: స‌మంత మౌనం వెనుక కార‌ణ‌మదేనా!

-

Samantha: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ ఫేర్ నాగచైతన్య, సమంత. కానీ ఆ జంట‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. వారి పెళ్లి మూడునాళ్ల ముచ్చ‌నే.. వారిద్ద‌రూ త‌ర్వ‌లో విడిపోతున్నారు. చైతూ.. సమంతకు భరణంగా కోట్ల రూపాయిలు ఇవ్వ‌నున్నాడంట‌. వారి పెళ్లిరోజు అక్టోబర్ 7న వారి వైవాహిక జీవితంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే సమంత హైదరాబాద్ వదిలి బాలీవుడ్ లో న‌టించేందుకు ముంబై చెక్కేస్తుంది. ఇలా ఒకటారెండా ఎన్నో పుకార్లు మీడియా, సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఇంత‌లా వార్త‌లు వ‌స్తున్నా.. ఇటు స‌మంత గానీ.. అటు చైతూ గానీ స్పందించ‌క‌పోవ‌డంతో ఆ వార్త‌ల‌కు మరింత ఊతమిచ్చిన‌ట్లు అయ్యింది.

ఈ నేప‌థ్యంలో మ‌రో వార్త క‌థ‌నం నెటింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వార్త కథ‌నం ప్ర‌కారం.. సామ్-చైతూలు పిల్లల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నారని, అందుకే సమంత కొత్త ప్రాజెక్టుల‌కు సైన్ చేయ‌డం లేద‌నీ .. ఇప్ప‌టికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తున్నార‌ని, ఈ క్ర‌మంలోనే త‌న స్నేహితుల‌తో హాలీ డే ట్రిపుల‌కు వెళ్తుంద‌ని ఓ కొత్త కథనం వెలుగులోకి వ‌చ్చింది. అందుకే వారిద్ద‌రూ ఈ క‌థ‌నాల‌ను పై స్పందించ‌కుండా మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవ‌ల ఈ విష‌యంపై సమంతను త‌న ఫ్యాన్స్ ప్ర‌శ్నించ‌గా.. తాను హైదరాబాద్‌లోనే ఉంటానని, హైద‌రాబాదే త‌న ఇళ్లు అని, తాను ఎక్కడికి వెళ్లనని… కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది.

ఇదిలాఉంటే.. సమంత ప్రస్తుతం న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ ‘కాదు వాకుల‌ రెండు కాదల్’ చిత్రంలో నటిస్తున్నారు. మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంత‌లం మూవీని పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news